ELR: జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ.. 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించి భార్య సావిత్రీబాయి పూలేను విద్యావంతురాలిని చేసి ఆమె ద్వారా ఇతర మహిళలకు విద్యను అందించారన్నారు.