SKLM: సోంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల ఎక్సైజ్ సీఐ జీవి రమణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 400 నాటు సారా ప్యాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాటు సారాపై ఏమైనా సమాచారం ఉంటే 9440902358 నెంబర్కు తెలియపరచాలని సీఐ తెలిపారు.