సత్యసాయి: మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా పుట్టపర్తి కలెక్టరేట్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. టెకులోడు ఎంజేపీ పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినుల ప్రతిభను అధికారులు మెచ్చుకున్నారు.