SKLM: పాత నేరస్థులపై నిఘా ఉంచాలని, కేసులు దర్యాప్తు, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి పోలీసులుకు ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించిరు. ప్రజల నమ్మకం నిలబెట్టే విధంగా పోలీసులు వ్యవహరించాలని అన్నారు.