కడప జిల్లాలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. లాక్డ్ హౌస్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు లాడ్జిల్లో తనిఖీలు చేపట్టి, అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు.