ELR: నూజివీడు మండలం సీతారామపురం గ్రామంలో పాడి రైతులకు విజయ డైరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ఆదివారం బోనస్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 111 మంది పాడి రైతులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3వ విడతగా 6,77,450 రూపాయలను బోనసుగా అందించినట్లు చెప్పారు. ప్రైవేటు డైరీలు ఎన్ని ఉన్నప్పటికీ నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో విజయ డైరీకి ఎవ్వరూ సాటికారని స్పష్టం చేశారు.