ప్రకాశం: ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్కు నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పీ. శ్రీధర్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు (ఐపీఎస్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ శుభాకాంక్షలు తెలుపుతూ.. మహిళలు, పిల్లల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.