అద్దంకి మండలంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వంట మనుషులు (కుక్స్), సహాయకులకు (హెల్పర్స్) మంగళవారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు కే. శ్రీనివాసరావు, కే. రమేష్ బాబు, ముఖ్య శిక్షకురాలు (ట్రైనర్) కట్టా సుకన్య హాజరయ్యారు.