VZM: గజపతినగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతకై అవిశ్రాంతంగా కృషిచేసిన సంఘసంస్కర్త అని చెప్పారు.