GDWL: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలను ఈనెల 14న ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత తెలిపారు. పాత ఎంపీడీవో కార్యాలయం వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.