MBNR: బాలానగర్ మండలానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింహులు కుమారుడు హర్షవర్ధన్ ఇంటర్ ఫలితాల్లో అదరగొట్టాడు. నల్గొండ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న ఇతడు 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించాడు. పేదరికంలోనూ ప్రతిభ చాటిన హర్షవర్ధను చూసి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు గర్వపడుతున్నారు.