గుంటూరు: జొన్న, మొక్కజొన్న పంటలకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తెనాలి తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన జరిగింది. మార్కెట్లో సరైన ధరలు లేక రైతులు నష్టాల్లో ఉన్నారని నేతలు తెలిపారు. ప్రభుత్వం త్వరగా స్పందించాలని డిమాండ్ చేశారు.