CTR: పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద అంతర్జాతీయ టైలర్స్ డే వేడుకల ఘనంగా నిర్వహించారు. బాణసంచా పేల్చి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. టైలర్స్ సంఘం అధ్యక్షులు శివానంద మాట్లాడుతూ.. టైలర్ షాపులు నిర్వహించే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్స్ సంఘం సభ్యులు మధుమేగా సూరి, శీను పాల్గొన్నారు.