AKP: కోటవురట్ల పరిసరాల్లో కోళ్ల ఉత్పత్తి పెరగడంతో చికెన్ ధరలు తగ్గాయి. ఆదివారం మార్కెట్లో బ్రాయిలర్ లైవ్ కిలో రూ.130, చికెన్ రూ.230, స్కిన్లెస్ రూ.240కు అమ్ముతున్నారు. బండ కోడి ధరలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. గత వారంతో పోలిస్తే కిలోకు రూ.40 నుంచి రూ.50 వరకు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. ఫారం కోడి గత వారం రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.160కు లభిస్తోంది.