SS: ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సర్టిఫికెట్లు అందజేశారు. హిందూపురం డిపోలో శిక్షణ పొందిన పది మంది నిరుద్యోగ యువతకు బుధవారం కలెక్టరేట్లో వీటిని పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.