సత్యసాయి: జిల్లా పోలీసులు శనివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో కదిరి, హిందూపురం ప్రాంతాల్లోని అనుమానాస్పద ఇళ్లు, లాడ్జీలు, రౌడీషీటర్ల నివాసాల్లో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.