NTR: వీరులపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. గెలుపు, ఓటములు సహజమని, ప్రతి ఆటగాడు క్రమశిక్షణతో ముందుకు సాగాలని అన్నారు. యువత సెల్ఫోన్లు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.