ASR: సీలేరు పీహెచ్సీ పరిధిలో మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. దుప్పిలివాడ పంచాయతీ వలసపల్లికి చెందిన మజ్జి హరికి మలేరియా సోకగా సకాలంలో చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారన్నారు. ఇటీవల కొర్ర రాధ (17)అనారోగ్యంతో మృతి చెందిందని పేర్కొన్నారు. జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.