KRNL: కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.