కృష్ణా: పెనమలూరులో ఇవాళ CM చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. బుధవారం సాయంత్రం సంయుక్త కలెక్టర్ నవీన్‌తో కలిసి పెనమలూరులోని 100 అడుగుల రహదారి మార్గంలో, కామినేని ఆసుపత్రి ఎదురుగా జరిగే ప్రైవేట్ కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు.