కోనసీమ: లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సుల కోసం మధ్యవర్తులను ఆశ్రయించవద్దని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు సూచించారు. అమలాపురం రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు నేరుగా కార్యాలయానికి రావాలని కోరారు. పరివాహన్ వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి ఎంవీఐ సమక్షంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.