కృష్ణా: గుడివాడలో 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్ష నిర్వహణకు అధికారులు పట్టణంలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నోటీసు బోర్డులో హాల్ టికెట్ నెంబర్ ప్రకారం కేటాయించిన గదులలోకి విద్యార్థులు చేరుకున్నారు. పరీక్షలు,ప్రశాంతంగా సక్రమంగా జరిగేలా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు.