ప్రకాశం: కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామ సమీపంలో వెలిసిన వెలుగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ అలివేలుమంగా సమేత వేంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపారు.