KRNL: జిల్లాలో రోడ్లు, ఇతర నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆర్&బీ, పంచాయతీరాజ్, RWS, తదితర శాఖల పనుల పురోగతిని పరిశీలించారు. ఆదోని డివిజన్లో రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.