MDK: వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ సూచించారు. సరదా కోసం పిల్లలు చెరువులు, కాలువలు, బావుల వద్దకు ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒకవేళ ఈత నేర్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా పెద్దల సమక్షంలోనే ఉండాలని, నీటి వనరుల వద్ద అజాగ్రత్తగా ఉండొద్దని ఆయన హెచ్చరించారు.