అన్నమయ్య: మదనపల్లెలో ఉమ్మడి AP మాజీ CM నాదెండ్ల భాస్కరరావు మృతికి జనసేన పార్టీ నాయకులు గురువారం సంతాపం తెలిపారు. జనసేన రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఆయన సేవలను స్మరించుకున్నారు. జనసేన నాయకురాలు చామంతుల మల్లిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు భాస్కరరావు చిత్రపటానికి నివాళులర్పించారు.