MHBD: చిన్నగూడూరు మండలంలోని మాంగోరిగూడెం గ్రామానికి చెందిన లూనావత్ కృష్ణకు కంబాలపెల్లికి చెందిన సునీతతో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.. గత కొంతకాలంగా కృష్ణ తన భార్య సునీతను అదనపు కట్నం విషయంలో తీవ్రంగా కొట్టి గాయపరిచారు. సునీత ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.