W.G: ఆచంట -పాలకొల్లు ప్రధాన రహదారిలోని ఎస్సీ శ్మశాన వాటికలో రూ.10 లక్షల పంచాయతీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచ్ కోట సరోజినీ వెంకటేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ప్రహరీ గోడతో పాటు రెండు కల్వర్టులను నిర్మించినట్లు తెలిపారు. ఈ నిర్మాణంతో అటు ప్రయాణికులకు, ఇటు స్థానికులకు ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు.