VZM: గుర్ల మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆదివారం మండలంలోని గుజ్జింగివలసలో నిర్వహించిన దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో నెల్లిమర్ల ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం. వెంకట్రావు, సబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.