E.G: జిల్లాలో ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో మొత్తం 145 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత అధికారులు తప్పనిసరిగా 24 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు.