సత్యసాయి: గోరంట్ల మండలంలోని వానవోలు ఎస్సీ కాలనీలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో మంగళవారం అంగన్వాడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించారు. పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని కోరారు.