WG: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకివీడు నగర పంచాయతీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ శనివారం వేగవంతంగా సాగింది. ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందిస్తుండటంతో, లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న అంశాన్ని నగర పంచాయతీ మేనేజర్ కే. వెంకటేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. అర్హులైన వారందరికీ తక్షణమే నగదు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు.