TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి ఎస్టీ కాలనీ సమీపంలో ఎండ్ల సుస్మిత (6) నీటి గుంతలో పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లాలోని సౌత్ అమలూరు, ఏకే నగర్‌కు చెందిన శంకరయ్య, విజయ దంపతులు జీవనోపాధి కోసం చిందేపల్లికి వలస వచ్చి నివసిస్తున్నారు. వారి కూతురు సుస్మిత పాఠశాలకు వెళ్లి వచ్చి తోటి పిల్లలతో ఆడుకుంటుండగా కాలుజారి గుంతలో పడి మృతి చెందింది.