SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. KGBVలో చదువుతున్న విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యలను ప్రస్తావించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి సర్టిఫికెట్లు సమయానికి జారీ కావడం అత్యంత అవసరమని అన్నారు. కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల సమస్యలను కూడా సభ దృష్టికి ఎమ్మెల్యే తీసుకువచ్చారు.