ATP: కళ్యాణదుర్గం మండలం గాజులపల్లిలో పీఎం సూర్య ఘర్ పథకాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీతో సోలార్ వ్యవస్థ అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 2438 మందికి 27.50 కోట్ల వ్యయంతో ఈ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మహిళల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు.