W.G: దుంపగడపలోని వీవీ గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ టి. యోగేశ్వరరావు తెలిపారు. ఈనెల 27 నుంచి మే 30 వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు కంప్యూటర్, సాఫ్ట్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.