AKP: నక్కపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చలపతిరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ రత్నం ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఎంపీటీసీలకు ఆహ్వానాలు పంపించినట్లు తెలిపారు. మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.