VZM: గజపతినగరం మండలం తుమ్మికాపల్లి గ్రామంలోని అంగన్వాడీ-1 కేంద్రంలో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో ఎం.రాజేశ్వరి ఆదేశాల మేరకు సూపర్వైజర్ టి.జానకి పర్యవేక్షణలో అంగన్వాడీ కార్యకర్తలు సుభాషిణి జయలక్ష్మి, సుజాత, చంద్రావతి, జానకి, జయ కలిసి గర్భిణీలు, బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు.
Tags :