KDP: ఖాజీపేట మండలంలో ‘స్వచ్ఛ భారత్’పై అవగాహన కోసం MPDO దివిజ సంపతి వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రతి గురువారం ‘స్వచ్ఛ రథం’తో బడులను సందర్శిస్తూ చైతన్యం తెస్తున్నారు. విద్యార్థులు ఇళ్లలోని ప్లాస్టిక్, కాగితాల వంటి పొడి చెత్తను బడికి తీసుకొస్తే విద్యా సామగ్రి ఇస్తామని ప్రకటించారు. ఖాజీపేట పాఠశాలలో విద్యార్థులతో సమావేశమై అవగాహన కల్పించారు.