కోనసీమ జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాలు, లొల్ల లాకులు వంటి సహజ సౌందర్య ప్రాంతాలు టూరిజం అభివృద్ధికి అపార అవకాశాలు కలిగి ఉన్నాయని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా లొల్లలాకులు తాతపూడి వద్ద నిర్వహిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ ట్రోఫీ డ్రాగన్ పడవల పోటీలు, ఈతల పోటీలను ఆయన స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావుతో కలిసి ప్రారంభించారు.