కృష్ణా: మచిలీపట్నానికి చెందిన సీహెచ్. సునంద ఇటీవల మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన 45వ జాతీయస్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొని, 3వ స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ నగర్లో గల ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జిల్లా కలెక్టర్ క్రీడాకారిణి సునందను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని బుధవారం ఆకాంక్షించారు.