అన్నమయ్య: రాజంపేట పట్టణం నూనెవారిపల్లి మార్గంలోని ఆకేపాటి భవనం వద్ద గుర్తుతెలియని యాచకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యాచకుడికి సుమారు 60 సంవత్సరాలు ఉంటాయని, అతని వద్ద ఆధారాలు ఏమీ లేవని పేర్కొన్నారు. యాచకుడి వివరాలి తెలిస్తే రాజంపేట పీఎస్ని సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.