TPT: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తిరుపతిలో జనసైనికులు భారీ ఎత్తున పూజలు నిర్వహించారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.