ATP: బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను MLA బండారు శ్రావణి ప్రారంభించారు. కేవలం ఐదు రూపాయలకే పేదల ఆకలి తీర్చడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసి పేదలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ADCC బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు పాల్గొన్నారు.