NLR: సమర్థవంతంగా పని చేస్తూ జిల్లాను ప్రగతి పథంలో నిలపాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 26 మందికి వివిధ హోదాలలో పదోన్నతులు కల్పిస్తూ ప్రొసీడింగ్‌ను కలెక్టర్ అందించారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి ఆర్ఎస్ఐలుగా 8మంది, గ్రేడ్-1 గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా కల్పిస్తూ 18 మందికి ఉత్తర్వులు జారీ చేశారు.