విశాఖ ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు బాపూజీనగర్‌లో శ్రీశ్రీశ్రీ దుర్గాలమ్మ, నూకలమ్మ అమ్మవార్ల గ్రామ పండుగ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొని అమ్మవార్లను దర్శించారు. కార్యక్రమానికి అనసూరి రమేష్‌బాబు ఆధ్వర్యం వహించగా, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ పాల్గొన్నారు.