ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి రైతులకు రావాల్సిన పెండింగ్ నిధులపై కీలక సమావేశం నిర్వహించారు. మండీ వ్యాపారులు, రైతులతో కలిసి చర్చించిన ఆమె, బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. రైతుల కష్టం వృథా కాకుండా చూస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్నదాతల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని భరోసా ఇచ్చారు.