నెల్లూరు: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యా ప్రామాణికతలు పాటించినందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ను అధికారులు బుధవారం అందజేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ సర్టిఫికెట్ను అందించారు. దీంతో కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.