ELR: టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పోలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత కొండపల్లి రవి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈయన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా (బీసీ విభాగం) పనిచేశారు. ఈయన నియామకం పట్ల నియోజకవర్గంలోని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.