VZM: పెన్షనర్ల సమస్యలపై రేపు (ఆదివారం) బొబ్బిలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ఎస్టీవో పీవీ పద్మనాభం చెప్పారు. ప్రభుత్వ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినతులు స్వీకరిస్తామన్నారు. ఏవీసీ సమర్పించని పాల్గొనవచ్చునని చెప్పారు.